మేడే సందర్భంగా నార్సింగిలో జెండా ఆవిష్కరణ

నార్సింగి, ఆంధ్రప్రభ : మేడే సందర్భంగా నార్సింగి హనుమాన్ మేస్త్రి సంగం ఆధ్వర్యంలో శుక్రవారం నాడు అంగడి బజార్ వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్మికుల హక్కులు, ఐక్యత ప్రాముఖ్యతను గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మహేష్, బాలరాజు, మహేష్, నర్సింలు, విజయ్, సిద్ధిరాములు, నారాయణ, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. మధు మాట్లాడుతూ.. కార్మికుల ఐక్యతే సమాజ అభివృద్ధికి మూలమని పేర్కొన్నారు. కార్యక్రమం అనంతరం సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు.
