హైదరాబాద్ బాట పట్టిన కార్మికులు.. ప్రధాన డిమాండ్లు ఇవే

ఊట్కూర్, ఆంధ్రప్రభ: భవన నిర్మాణ కార్మికులు, తాపీ మేస్త్రీలు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పెద్దపోర్ల గ్రామం నుంచి సోమవారం చలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలివెళ్లారు.
ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకుడు కనకారాయుడు, తాపీ మేస్త్రీల సంఘం గ్రామ అధ్యక్షుడు కోళ్ల కృష్ణయ్య మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం వెంటనే పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
అలాగే భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించి, వారి సంక్షేమానికి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్మికుల హక్కులను పరిరక్షించి వారికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు చిన్న బాలు, గ్రామ కమిటీ సభ్యులు గుడిసె రాజు, కావలి బలప్ప, తాపీ మేస్త్రీలు హుసేన్, కాశప్ప, హన్మంతు, వాకిటి సూరి, కోళ్ల రాఖి, అయ్యప్ప, లింగప్ప, కమ్మరి లక్ష్మయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
