మృతుని కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత

తొర్రూరు, ఆంధ్రప్రభ : మండలంలో గుర్తురు గ్రామానికి చెందిన గుడివాడ సోమయ్య ఇటీవల మృతి చెందడంతో తోటి స్నేహితులు వారి కుటుంబాన్ని పరామర్శించి 50 కేజీల బియ్యం అందజేసి,ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా స్నేహితులు సంయుక్తంగా మాట్లాడుతూ.. సోమయ్య అకాల మరణం బాధాకరమన్నారు.

ఆయన మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరమని, వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి ఆపద సమయంలోనైనా తోడుంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో గుడివాడ శివకుమార్,పిల్లి నాగరాజు వడ్లకొండ రాంబాబు,పెంట సుధాకర్,పెందోట కిషన్ రావు, వడ్లకొండ యకాబ్రం,మెరుగు రాజేష్ గౌడ్,తోకల కృష్ణమూర్తి, సింగరం మధు,గుద్దేటి యాకన్న, కూరపాటి పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.