మొగ్ధంపూర్ – జక్లేర్ బస్సు పునరుద్ధరించాలి..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణ పేట డిపో నుండి ఊట్కూర్ మండల పరిధిలోని మొగ్ధంపూర్ – మక్తల్ మండలంలోని జక్లేర్ బస్సు పునరుద్ధరించి ప్రయాణికుల సమస్యలు పరిష్కరించాలని సామాజిక కార్యకర్త హెచ్. నర్సింహా ఒక ప్రకటనలో కోరారు. టిజియస్ ఆర్ టి సి అధికారులు స్పందించి వెంటనే ప్రయాణికులకు, వేసవిలో వివిధ పోటీ పరీక్షలకు జిల్లా కేంద్రంలోని నిర్వహించే ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకుండాతక్షణమే బస్ ప్రారంభించాలని కోరారు.

బిజ్వార్, మొగ్దంపూర్, పులిమామిడి, జక్లేర్ నుండి వచ్చే ప్రయాణికులకు కూడా చాలా ఇబ్బంది అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద జట్రం -నర్వ బస్ ఉదయం 6 గంటలకు రావడం వలన పోటీ పరీక్షలు, ప్రత్యేక తరగతులు, కంప్యూటర్, టైప్ కు వచ్చే విద్యార్థులకు చాలా ఇబ్బంది అవుతుందని తెలిపారు.

నారాయణ పేట డిపో ఆర్ టి సి అధికారులు మొగ్దంపూర్- జక్లేర్ బస్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వేసిన బస్సు నిలిపివేయడంతో ప్రయాణికులకు ఏర్పడిందని తెలిపారు. విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన బస్సు లు రద్దు చేసి పాఠశాలు పునః ప్రారంభం అయిన తర్వాత ప్రారంభిస్తే ఇలాంటి ఇబ్బందులు లేవని అన్నారు. ఎన్నో సంవత్సరాల నుండి ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన ఈ బస్సు రద్దు చేయడం వలన ప్రయాణికులకు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.

Leave a Reply