శ్రీశైలంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
శ్రీశైలంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
భ్రమరాంబికా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు
ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో చర్చ
నంద్యాల బ్యూరో, (ఆంధ్రప్రభ): కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సోమవారం శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించి, శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న కిషన్ రెడ్డికి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి (ఈవో) శ్రీనివాసరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక దర్శనం కల్పించి వేద మంత్రోచ్ఛారణల మధ్య పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు శ్రీశైల క్షేత్ర విశిష్టత, చారిత్రక ప్రాధాన్యం, ఆలయంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి కేంద్రమంత్రికి వివరించారు. ఆలయ పరిపాలన, శాసన సంప్రదాయాలు, భక్తులకు అందిస్తున్న సేవలపై కూడా అవగాహన కల్పించారు.
దర్శనం అనంతరం కిషన్ రెడ్డి ఆలయ అర్చకుల ఆశీర్వాదాలు స్వీకరించి తీర్థప్రసాదాలు అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, అర్చకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
