Union Minister | డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి క్లారిటీ..
Union Minister | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) వల్ల దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా నష్టపోతాయన్న ప్రచారానికి కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి తెరదించారు. పార్లమెంటు స్థానాల పెంపుపై ఆయన కీలక గణాంకాలను విడుదల చేస్తూ స్పష్టతనిచ్చారు.
దక్షిణాదిలోని ప్రతి రాష్ట్రంలోనూ ఎంపీ సీట్ల సంఖ్య సుమారు 50 శాతం మేర పెరగబోతోందని ఆయన వెల్లడించారు. కిషన్ రెడ్డి వెల్లడించిన అంచనా వివరాలు:కేంద్రమంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం, దక్షిణాది రాష్ట్రాల్లో పెరగనున్న సీట్ల వివరాలు ఈ క్రింది
విధంగా ఉన్నాయి:
తెలంగాణ 17 +9 26
ఆంధ్రప్రదేశ్ 25 +13 38
కర్ణాటక 28 +14 42
తమిళనాడు 39 +20 59
కేరళ 20 +10 30
ప్రాంతీయ ప్రయోజనాలకే పెద్దపీట: ప్రతి రాష్ట్రంలో ఎంపీల సంఖ్య గణనీయంగా పెరగడం వల్ల ప్రజలకు తమ ప్రతినిధులు మరింత చేరువవుతారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన మాత్రమే కాకుండా, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని శాస్త్రీయంగా ఈ పునర్విభజన జరుగుతుందని, ఏ రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యంగా తెలంగాణలో 26 స్థానాలకు, ఆంధ్రప్రదేశ్‌లో 38 స్థానాలకు ఎంపీ సీట్లు పెరుగుతుండటం వల్ల తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యత కేంద్రంలో మరింత పెరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విపక్షాలు అనవసర భయాలను సృష్టించవద్దని ఆయన ఈ సందర్భంగా హితవు పలికారు.
