ప్రయాణికులు రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ నిర్ణయం
ఎగ్జిక్యూటీవ్ కోచ్‌లను పెంచిన అధికారులు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : సికింద్రాబాద్-విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ (20707, 20708)కు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కోచ్‌ల సంఖ్య పెంచుతూ దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. డిమాండ్‌కు అనుగుణంగా మరో నాలుగు కోచ్‌లను అదనంగా పెంచారు. దీంతో హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం మధ్య తిరిగే ప్రయాణికులకు కొంత వరకు ఇబ్బందులు తొలుగుతాయి.
18కి పెరిగిన ఏసీ చైర్ కార్ కోచ్‌లు
సికింద్రాబాద్-విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ కు దక్షిణ మధ్య అధికారులు తీసుకున్న నిర్ణయం మేరకు ఏసీ చైర్ కార్ కోచ్‌లు 18కి పెరిగాయి. ఇప్పటి వరకూ 14 ఏసీ చైర్ కార్ కోచ్‌లు ఉండగా, అదనంగా మరో నాలుగు కోచ్‌లను ఏర్పాటు చేశారు. వీటితో పాటు రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌ల సంఖ్యలో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం వందేభారత్ కోచ్‌ల సంఖ్య 20కి చేరింది.