Vikarabad | పెండింగ్స్ స్కాలర్ షిప్ లు విడుదల చేయాలి.. ఎస్ఎఫ్ఐ

వికారాబాద్, జూలై 5 (ఆంధ్రప్రభ) : పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ స్కాలర్ షిప్స్ వెంటనే విడుదల చెయ్యాలని SFI జిల్లా ఉపాధ్యక్షుడు తేజ డిమాండ్ చేశారు. వికారాబాద్ (Vikarabad) జిల్లా కేంద్రంలో స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలని నిరసన తెలియజేశారు. అనంతరం SFI వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు తేజ మాట్లాడుతూ… గత 6 ఏళ్లుగా రాష్ట్రం లో ఫీజు రీయింబర్స్ మెంట్ స్కాలర్ షిప్స్ విడుదల చేయలేదని, దాదాపు 8400 కోట్ల రూపాయలకు పైగా పెండింగ్ లో ఉన్నాయన్నారు.

ఫీజు రీయింబర్స్ మెంట్ స్కాలర్ షిప్స్ విడుదల చెయ్యకపోవడం వల్ల ఇంటర్, డిగ్రీ, బిటెక్, MBBS నర్సింగ్ చదువుతున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. తమ విద్యను పూర్తి చేసుకొని ఉన్నత విద్యకు వెళ్లాలంటే సర్టిఫికెట్స్ కచ్చితంగా అవసరం కావ‌డంతో ప్రైవేట్ కళాశాలలు ఫీజు రీయింబర్స్ మెంట్ రాలేదు కాబట్టి, కాలేజీ ఫీజు మొత్తం కడితేనే సర్టిఫికెట్స్ ఇస్తున్నారన్నారు. దీని వల్ల పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమ‌వుతున్నారన్నారు.

గతంలో సీఎం రేవంత్ రెడ్డి పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ స్కాలర్ షిప్స్ విడుదల చేస్తామని బహిరంగంగా ప్రకటించి ఏడాది గడుస్తున్నా విడుదల చేయని దుస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వాలు మారినా పాలన మారడం లేదని, ప్రభుత్వం, అధికారులు స్పందించి పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చెయ్యాలని, లేదంటే SFI ఆధ్వ‌ర్యంలో తాము విద్యార్థులతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో SFI జిల్లా సహాయ కార్యదర్శి అనిల్, జిల్లా కమిటీ సభ్యులు అభిషేక్, సిద్దార్థ తదితర విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply