TRADERS MEET :  బెస్ట్​  మార్కెటింగ్  కల్పిద్దాం

TRADERS MEET :  బెస్ట్​  మార్కెటింగ్  కల్పిద్దాం

  • అవినీతికి చోటు వద్దు
  • తూనికల్లో మోసాలు అరికడదాం
  • కర్నూ  జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

( కర్నూలు,  ఆంధ్రప్రభ ప్రతినిధి)

TRADERS MEET

రైతులు పండించే పంటలకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య లక్ష్యమని జిల్లా కలెక్టర్ (Kurnool Collector )   డా.ఏ.సిరి అన్నారు..శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో రైతులు పండించే పంటలకు మార్కెటింగ్ చేసే విధంగా కలెక్టర్ ట్రేడర్ లతో సమావేశం నిర్వహించారు..

ఈ సందర్భంగా కలెక్టర్ సిరి (Dr.Sir)  మాట్లాడుతూ రైతులు పండించే పంటలకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తూ, సాగు చేసిన పంటలకు సరైన ధర లభించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్  ట్రేడర్లను (traders) ఆదేశించారు.. రైతులు సాగు చేసిన పంటలను ట్రేడర్ లతో మ్యాపింగ్ చేసి రైతులు ( Maping Farmers)  నష్టపోకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు.. రైతులకు న్యాయమైన ధర అందే విధంగా మార్కెటింగ్ కార్యకలాపాలు నిర్వహించాలన్నారు..

కొనుగోలు కేంద్రాల్లో  (weighing mecheins) బరువు కొలిచే యంత్రాలలో ఎటువంటి అవినీతి (Correption)  జరగకుండా చూసుకోవాలని, అదే విధంగా రైతులకి కనీస మద్దతు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ట్రేడర్ లను ఆదేశించారు..  జిల్లాలో  రైతులు పండించే ప్రధాన పంటలకి  మార్కెట్ లింకేజీలు బలపరచాలన్నారు. మార్కెట్ యార్డ్ లో Markrt Yards)  శానిటేషన్ సక్రమంగా జరిగే విధంగా చూసుకోవాలని కలెక్టర్ మార్కెటింగ్ ఏడి ని ఆదేశించారు..

సమావేశంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, ఉద్యాన శాఖ అధికారి రాజాకృష్ణ రెడ్డి, మార్కెటింగ్ ఏడి నారాయణ మూర్తి, మార్కెట్ యార్డ్ సెక్రెటరీ జయలక్ష్మి ,   పాల్గొన్నారు..

Leave a Reply