Missing | మహా కుంభమేళాలో టీటీడీ ఉద్యోగి అదృశ్యం
తిరుమల: ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో తితిదే ఉద్యోగి అదృశ్యమయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అక్కడ ఏర్పాటు చేసిన నమూనా ఆలయంలో విధులు నిర్వహించేందుకు వెళ్లిన దీవేటి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి బుధవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయారు.
ఆయన ఆచూకీ కోసం స్థానిక పోలీసులు, టీటీడీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉద్యోగి అదృశ్యంపై పూర్తి సమాచారం అందించాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. శ్రీవారి నమూనా ఆలయంలో పనిచేసేందుకు సుమారు 200మంది టీటీడీ ఉద్యోగులు వెళ్లారు. ఈ క్రమంలో ఓ ఉద్యోగి అదృశ్యమయ్యారు.