300 meters | 8మంది మృతి..

300 meters | 8మంది మృతి..
300 meters | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టెహ్రీ గర్వాల్ జిల్లాలోని చంబా-కోటీ రహదారిపై వాహనం అదుపుతప్పి లోయలో పడిపోవడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం ప్రకారం, వాహనం సుమారు 300 మీటర్ల లోతైన లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు.
గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.
