పాపం.. పసివాడు..

పాపం.. పసివాడు..

చండ్రుగొండ, ఆంధ్రప్రభ : స్కూల్ బస్సు టైర్ కిందపడి రెండేళ్ల బాలుడు మృతి చెందిన విషాదకర సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల పరిధిలోని కరిషల బోర్డు తండాలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం.. జూలూరుపాడుకు చెందిన ఓ ప్రైవేటు స్కూలు బస్సు నిత్యం బడి పిల్లల కోసం ఆ గ్రామానికి వచ్చేది. ఇదే క్రమంలో మంగళవారం కరిషల బోర్డు చేరుకున్న బస్సు విద్యార్థులను ఎక్కించుకుంటూ ఉండగా భూక్య గోపి, అఖిల దంపతుల కుమారుడు భూక్య దర్శి నాయక్ (2) ఆడుకుంటూ బస్సు ఎదురుగా వచ్చాడు. ఆ పసివాడు రావడం గమనించని డ్రైవర్ బస్సును ముందుకు కదిలించాడు. దీంతో ముందు చక్రం బాలుడి పైకి ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న చండ్రుగొండ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply