అనుమతి అక్కర్లేదు

ఇదీ ఒంగోలు అర్బన్​ అభివృద్ధి

పంచాయతీకి కప్పం కట్టొద్దు

క్యాష్​ అండ్​ క్యారీ ఆఫీసర్లకే

( ఒంగోలు, ఆంధ్రప్రభ ప్రతినిధి):

చేప చేప ఎందుకు ఎండ లేదంటే గడ్డి  వాము అడ్డు వచ్చిందంటూ పాతకాలపు సామెతను సింగరాయకొండ లో అక్రమ వెంచర్లను (ventures) కాపు కాస్తున్న పంచాయతీ అధికారులు రెవిన్యూ సిబ్బంది ఆపై ఒడ తీరు కూడా అదే విధంగా మారింది ఈ ప్రాంతంలో యదేచ్ఛగా కోట్ల రూపాయల భూములను తక్కువ రేటు-కు వ్యవసాయ భూములుగా (agriculture lands) కొనుగోలు చేసి అనధికార ప్లాట్లు- వేస్తూ దర్జాగా దోచేస్తున్నారు మరికొందరి ప్రబుద్ధులు ఎటు-వంటి ఆర్భాటం లేకుండానే రాళ్లు కూడా వేయకుండా బ్రోచర్లలోనే ప్లాట్ల నిర్మాణం చేపట్టి అమ్మి వేస్తున్న ఘనులు కూడా ఈ సింగరాయకొండలో తయారయ్యారు కొందరు వ్యవసాయ భూములను కొనుగోలు చేసి తాత్కాలికంగా కన్వర్షన్‌ చేయించుకుంటు-న్నారు కానీ వెంచర్‌ కు ఉండవలసిన అనుమతులు (permissions) ఏమి పాటించటం లేదు టిఎల్‌పి (TLC) తాత్కాలిక స్థలం అనుమతులు తీసుకుంటూ ఇస్తారాజ్యంగా అమ్మి వేస్తున్నారు దీంతో కొనుగోలు చేసిన అమాయకపు ప్రజలు భవిష్యత్తులో ఇల్లు కట్టు-కోవాలంటే బ్యాంకుల వద్ద రుణాలు ( bank loans) రాక పంచాయతీ అధికారుల వద్ద బార్లు నిలబడిన ఇంటి పన్నుల నిర్మాణంలోనూ ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నారు ఇంత జరుగుతున్నా అనధికార వెంచర్లను అటు- పంచాయతీ అధికారులు (local body officials) కానీ రెవిన్యూ సిబ్బంది కానీ ఒడ వారు సైతం ఆపలేకపోతున్నారు . సింగరాయకొండ మండలంలో జాతీయ రహదారిపై ఊళ్లపాలెం రోడ్డు లోను శానంపూడి (Sanam pudi) గ్రామ పరిసరాల్లోనూ నర్రా వారి పాలెం (narra vari palem) లోను విపరీతంగా అనుమతి లేని వెంచర్లు దర్శనమిస్తున్నాయి

వీటిలో ఏ ఒక్క దానికి ఒడ అనుమతి లేదు ఈ వెంచర్ల పుణ్యమా అంటూ పంచాయతీ అధికారులుకు సర్పంచ్లకు రాజకీయ నేతలకు (politicl leaders) డబ్బులు గట్టిగానే చేరుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. గత ఐదేళ్లలో అన్ని గ్రామాల సర్పంచులకు (surpachs) వాళ్ళ పంచాయతీ పరిధిలో అనధికార వెంచర్లు వేస్తే భారీగానే ముడుపులు ముట్టాయని ఇప్పటి అధికార పక్షం కోడై కూసింది కానీ నేడు 16 నెలల నుండి కూడా అదే తరహాలో పంచాయతీ అధికారులు (panchayat officials) రాజకీయ నేతలు (politicians) వాటిపై చర్యలు తీసుకోకపోగా పాత పందానే కొనసాగిస్తున్నారు. వెంచర్‌ ఏర్పడాలంటే 33 అడుగుల రహదారులు కరెంటు- పూర్తిస్థాయిలో నిర్మాణాలు డ్రైనేజ్‌ వ్యవస్థ (drinage) ఎక్కడికక్కడ ఏర్పాటు- నీటి వసతి వాటర్‌ హెడ్‌ ట్యాంకు (water head tanks) పంచాయతీకి స్థలం కేటాయించాలి వీటితో పాటు- పంచాయితీకి ప్రభుత్వానికి రావలసిన రుసుం రాకుండా అధికారుల జేబుల్లోకి వెళ్ళటంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది సింగరాయకొండ (singaraya konda) మండలంలో పదుల సంఖ్య పైబడి అనధికార వెంచర్లు ఉంటే ఏ ఏ పంచాయతీలకు వాటి ద్వారా రుసుం ఎంత చెల్లించబడిందో జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రభుత్వానికి రావలసిన ఆదాయాన్ని ( దోచేస్తున్న అటు- ప్రభుత్వ జిల్లాఉన్నతాధికారులు కూడా పట్టించుకోకపోవడంపై వాటాల రేటు- చెప్పకనే చెబుతుంది. రెవిన్యూ అధికారులు ( reveneu officials) మా పరిధిలో కన్వర్షన్‌ లెటర్‌ (conversion letter) అందించామని ఇక మాకు సంబంధం లేదంటూ చేతులు దులుపుకుంటు-న్నారు కానీ ఆ స్థలాలు ప్రభుత్వ స్థలాల లేక కుంట భూముల దేవాలయ భూములు (temple lands) ఏమైనా ఉన్నాయా అన్న చూడవలసిన పరిస్థితి కూడా చూడకుండా వ్యవసాయ భూములను సైతం ఇష్టారాజ్యంగా అనుమతి లేకుండా ప్లాట్లు-గా అమ్మి వేస్తున్న మాకు ఏమీ సంబంధం లేనట్లు- వ్యవహరిస్తున్నారు పత్రికల్లో వార్తలు వస్తే మాత్రం జిల్లా యంత్రాంగానికి తగు కారణాలు వివరిస్తున్నారు కానీ నిజనిర్ధారణ మాత్రం చేయటం లేదని వాస్తవిక స్థితి నెలకొంది . అనుమతి లేని వెంచర్లలో సర్వే నెంబర్లు suevay numbers) చూపించి ప్లాట్ల నిర్మాణాలు చేపట్టి అమ్మకాలు చేయడం ఎంతో తప్పిదమని తెలియక ఆ ప్లాట్లు- కొనుగోలు చేస్తున్న అమాయకపు ప్రజలు భవిష్యత్తులో వాటి నిర్మాణాలు ఏర్పాట్లు- ఎన్నో ఇబ్బందులకు గురి అవుతాయి కనీసం ఆ స్థలం ప్రభుత్వానిదా లేక ప్రైవేట్‌ దా అన్న విషయం కూడా తెలియకుండా కొనుగోలు చేస్తున్న అమాయక ప్రజలు దర్శనమిస్తున్నారు వాటిని నమ్ముకొని బ్యాంకుల వద్ద రుణాలకు వెళితే బ్యాంక్‌ అధికారులు నియమ నిబంధనలకు లోబడి రుణాలు మంజూరు చేయమని తెలుపుతూ ఉండడంతో మోసపోయామని ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితిలో అయోమయ స్థితిలో ప్రజలు నెలకొంటు-న్నారు. వెంచర్లలో ఇళ్ల నిర్మాణం జరగాలంటే పరిసర ప్రాంతాలు ఎంతో ముఖ్యమని ఎటు-వంటి ఇబ్బందులు లేని ప్రాంతాల్లోనే ఇంటి నిర్మాణాలు జరగాలి అయితే ఊళ్ళ పాలెం రోడ్‌ ullapalem road) లో అనధికార విషవాయువులను (poluted gas) విడుదల చేసే ఎన్నో పరిశ్రమలు( factoreis) ఉన్న వాటి ద్వారా వచ్చే చెడువాసన (bad smell) భరించలేని విధంగా వస్తున్న ఆ ప్రాంతాలలో జోబు లు నింపుకోవడం కోసం వెంచర్లు ఏర్పాటు- చేసి అమ్మకాలు చేస్తున్నారు గత ప్రభుత్వంలో జగనన్న కాలనీ (jagananna colny) ఇంటి నిర్మాణం చేశారు కానీ పరిశ్రమల దుర్వాసనకు ఆ ప్రాంత ప్రజలు నిత్యం అవస్థలు పడుతున్నారు అవేమీ పట్టించుకోకుండా ఆ ప్రాంతాలలోనే వెంచర్లు ఏర్పాటు- చేసి సామాన్య ప్రజల జోబు లు కొల్లగొడుతున్నారు కొంతమంది అధికారులు రియల్‌ ఎస్టేట్‌ (real estate ) వ్యాపారం చేసే వెంచర్లు యజమానులు దగ్గరకు వెళ్లిన రాజకీయ అండదండలతో వారి వీధిలో అడ్డుపడుతుండడంతో ఏమీ చేయలేని స్థితిలో ఉన్నామని కొంతమంది అధికారులు తెలుపుతున్నారు కనీసం ఇప్పటి-కై-నా అనధికార వెంచర్లపై రెవెన్యూ అధికారులు కానీ పంచాయతీ అధికారులు కానీ చివరకు ఒడ సిబ్బంది సైతం సింగరాయకొండ లో (singatraya konda) జరుగుతున్న రియల్‌ దోపిడీపై చర్యలు తీసుకోవాలని సామాన్య ప్రజలు కోరుకుంటు-న్నారు.

Leave a Reply