ఎర్రకుంట మాయంపై ప్రజావాణిలో ఫిర్యాదు

ఎర్రకుంట మాయంపై ప్రజావాణిలో ఫిర్యాదు
బాలానగర్, మార్చి 3, ఆంధ్రప్రభ : బాలానగర్ గ్రామపంచాయతీలో గల సర్వేనెంబర్ లో 6.09 గుంటల భూమిని ఎర్రకుంటను మాయం చేశారని బీసీ ఎస్టీ ఎస్సీ కమిటీ చైర్మన్ మండల అధ్యక్షుడు మధు ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కలెక్టర్ స్వయంగా వచ్చి అన్ని పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

