పీజీఆర్ఎస్ అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలి

పీజీఆర్ఎస్ అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలి

తిరుపతి, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో వచ్చిన అర్జీలకు సకాలంలో నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.

సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శివశంకర్ నాయక్, భరత్ నాయక్, రోజ్‌మాండ్‌లతో కలిసి ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

అర్జీదారులకు గౌరవప్రదంగా కూర్చునే సౌకర్యం, తాగునీరు, మెడికల్ క్యాంప్, గ్రామాల నుంచి వచ్చిన వారికి టీ సరఫరా వంటి ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రజల సమస్యలను అధికారులు సావధానంగా విని అర్జీలు స్వీకరించారు.

పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని, అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యలను పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. స్పందన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. నిర్లక్ష్యం చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మొత్తం అర్జీలలో రెవెన్యూ శాఖకు అత్యధికంగా 246 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.


Leave a Reply