దాహంతో దద్దరిల్లిన పరమేశ్వర మంగళం..
దాహంతో దద్దరిల్లిన పరమేశ్వర మంగళం..
నీటి ట్యాంకులు తొలగింపుపై జాతీయ రహదారిపై ప్రజల ఆగ్రహ జ్వాలలు
పుత్తూరు, ఆంధ్రప్రభ : పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని పరమేశ్వర మంగళం వద్ద గురువారం ప్రజలు ఆందోళనకు దిగారు. మా నీరు పథకం త్రాగునీటి ట్యాంకులను ప్రత్యామ్నాయం చూపకుండా తొలగించడంతో తీవ్ర తాగునీటి సమస్య నెలకొన్నదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మండుతున్న వేసవిలో తాగునీరు లేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని మహిళలు, వృద్ధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో స్థానికులు జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. రోడ్డుపై పెద్దఎత్తున కూర్చొని నిరసన తెలపడంతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో హైవేపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
“ముందుగా ప్రత్యామ్నాయ నీటి సౌకర్యం కల్పించి తర్వాత ట్యాంకులు తొలగించాల్సింది” అని ప్రజలు మండిపడ్డారు. సమస్యను వెంటనే పరిష్కరించి తాగునీటి సరఫరా పునరుద్ధరించాలని స్థానికులు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం….
