కుప్పం, (ఆంధ్రప్రభ): రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పం లో నూతనంగా ఇంటి నిర్మాణం పూర్తి చేసుకొని ఆదివారం నాడు కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లి పంచాయతీ శివపురం వద్ద నూతనంగా నిర్మించిన తన సొంత ఇంటి గృహ ప్రవేశం కార్యక్రమం అత్యంత వైభవం గా నిర్వహించడం జరిగింది. ఉదయం 5గంటల నుండి 6గంటల లోపల వేదపండితుల మంత్రోచ్ఛరణ మధ్య సొంత ఇంటికి లోకి చంద్రబాబు కుటుంబ సభ్యులు దేవుడి చిత్ర పటాలను తీసుకోని గృహప్రవేశం చేశారు.

సీఎం చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి నారా భువనేశ్వరి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆయన సతీమణి నారా బ్రాహ్మణి పాల్గొని గృహప్రవేశం కార్యక్రమం లో నిర్వహించడం జరిగింది.
నూతన గృహం వద్ద టిడిపి శ్రేణుల కొలహాలం
సీఎం చంద్రబాబు కుప్పం లో నూతనంగా నిర్మించిన నూతన గృహప్రవేశం సందర్బంగా పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. వారి కోసం విందు భోజనాలు ఏర్పాటు కోసం భారీగా షెడ్ లు సుమారు ఇరవై వేల మంది భోజనాలు చేసే విధంగా సదుపాయాలు కల్పించారు. కుప్పం నియోజకవర్గంతో పాటు చిత్తూరు జిల్లా నుండి పెద్ద ఎత్తున టీడీపీ నాయుకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చంద్రబాబు ఇంటి గృహప్రవేశం సందర్బంగా శాంతిపురం టీడీపీ నాయకులు నందిగాం ఉదయ్, జడ్పీటీసీ అభ్యర్థి, క్లస్టర్ ఇంచార్జి చంద్ర ఆధ్వర్యంలో భారీగా ఫ్లెక్సీ లు ఏర్పాటు ప్రత్యేక ఆకర్షణ గా మారింది.
ట్విట్టర్ వేదిక గా కుప్పం ప్రజలు నారా భువనేశ్వరి అభినందనలు తెలిపారుకుప్పంలో సొంతింటి గృహప్రవేశ కార్యక్రమం నాకు ఎంతోసంతోషాన్నిచ్చిందని 36 ఏళ్లుగా మా కుటుంబానికి అండగాఉంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ మాకు ఆత్మబంధువులైన కుప్పం ప్రజల ఆశీస్సుల నడుమ గృహప్రవేశం జరిగడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. .కల్మషం లేని మంచి మనుషుల మధ్య మా కుటుంబ సభ్యులుగా భావించే ప్రజలఆశీర్వాదంతో జరిగిన కార్యక్రమం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. సొంతింటి పండుగలా నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజల మధ్య జరిగిన ఈ శుభకార్యం నాకుఎన్నటికీ గుర్తుండిపోతుందని కుప్పం నియోజకవర్గ ప్రజలదీవెనలకు, ఆత్మీయతకు, అభిమానానికి, మద్దతుకు శిరస్సువంచి నమస్కారాలు తెలుపుతున్నానని ఆమె పేర్కొన్నారు.
కుప్పం చేరుకున్న చంద్రబాబుకుప్పం,

నూతనంగా నిర్మించిన తన సొంత ఇంటి గృహ ప్రవేశం కార్యక్రమం నిమిత్తం శనివారం రాత్రి బెంగళూరు నుండి రోడ్డు మార్గాన కుప్పం పి ఈ ఎస్ మెడికల్ కాలేజ్ లోని అతిథి గృహం నకు చేరుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వెంట ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న పిఎస్, సంబంధిత ఉన్నతాధికారులు ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, అనంత పురం రేంజ్ డిఐజీ షిమోషి, జిల్లాకలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, కడా పిడి వికాస్ మర్మత్, నాయకులు డా.సురేష్ బాబు, ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు.