నిత్య అన్నదాన పథకానికి రూ.1 లక్ష విరాళం అందజేత
నిత్య అన్నదాన పథకానికి రూ.1 లక్ష విరాళం అందజేత
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి మొగల్రాజపురానికి చెందిన దంపతులు విరాళం అందజేశారు.
విజయవాడ మొగల్రాజపురంకు చెందిన డి. మోహన్ కుమార్, అనుపమ దంపతులు రూ.1,00,000 విరాళాన్ని ఆలయానికి అందజేశారు. ఈ విరాళాన్ని నిత్య అన్నదాన పథకం కోసం వినియోగించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
దంపతులకు ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం ఏర్పాటు చేశారు. అనంతరం వేదాశీర్వచనం అందించి, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, రసీదు అందజేశారు.
Slug: rapthadu-smam-2025-agriculture-machinery-subsidy-last-date-today
