మంథని, ఆంధ్రప్రభ : మంథనిలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పట్టణంలోని రావుల చెరువు అందాలను ఆరబోస్తుంది. మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి అనుకున్న చెరువు నిండుకుండలా చూపర్లను ఆకట్టుకుంటుంది. మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో త్వరలో ఇక్కడ మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు కాబోతుందని సమాచారం.