ఘనంగా ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు జన్మదిన వేడుకలు

తాడ్వాయి, ఆంధ్రప్రభ : ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు జన్మదిన వేడుకలను తాడ్వాయి మండలంలోని చిట్యాల గ్రామంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు పెన్నులు, నోటు పుస్తకాలు, చాక్లెట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడని కొనియాడారు. ఆయన మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రంజిత్‌రెడ్డి, ఉప సర్పంచ్ మల్లేష్, ఏఎంసీ వైస్ చైర్మన్ జక్కుల రాజిరెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ బాలం భాయ్, మండల జనరల్ సెక్రటరీ విట్టల్, చిట్యాల గ్రామ అధ్యక్షుడు మ్యడం పెద్ద బాలయ్య, ఉపాధ్యక్షుడు గైని సాయిలు, సొంటికి పెద్ద సాయిలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గణిశ్యాం కిషన్‌రావు, సలహాదారు మనగారి దుర్గయ్య, మేడం కిషన్, వడ్లూరి రాములు, మహిళా అధ్యక్షురాలు విజయ, సారుగు మహేందర్, కమ్మరి లక్ష్మయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.