ఘనంగా వర్ల రామయ్య పుట్టినరోజు వేడుకలు..
అవనిగడ్డ, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పుట్టినరోజు వేడుకలను అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు పంచుకుని శుభాకాంక్షలు తెలిపారు.వర్ల రామయ్య పార్టీ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారని నాయకులు కొనియాడారు. ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు విక్కుర్తి రాంబాబు,కొల్లూరి వెంకటేశ్వరరావు,యాసం చిట్టిబాబు,మాచవరపు ఆదినారాయణ,బండే రాఘవ,మెగవత్తు గోపి,అన్నపరెడ్డి లక్ష్మినారాయణ,కొల్లూరి ఇమ్మానియేలు,ఘంటసాల రాజమోహనరావు,దాసినేని శ్రీనివాసరావు,విశ్వనాథుని మురళి,బర్మా శ్రీను,లుక్క పిచ్చయ్య,షేక్ బావావలి,లుక్క శ్రీనివాసరావు,రాజులపాటి తాండవ,పులిగడ్డ చంద్ర,భూపతి నాంచారయ్య,రేపల్లె ముసలయ్య,ముళ్ళపూడి శ్రీనివాసరావు,కొండవీటి గోవిందు,నాగిడి రాంబాబు,కొల్లూరి వాసు,పిరాటి రాంబాబు,లింగం బాబూరావు,సిద్ధాబత్తుని హరిబాబు,గుడివాక మల్లికార్జునరావు,చెన్ను నాగ మల్లేశ్వరరావు,గుగ్గిలం శ్యామ్ కుమార్,పులిగడ్డ నాంచారయ్య,షేక్ బషీర్,నారేపాలెం శివరామ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
