కూటమి ప్రభుత్వం పార్టీలకు, కుల మతాలకు అతీతం

  • చంద్రగిరిలో చర్చ నూతన భవనానికి భూమిపూజ
  • కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పులివర్తి నాని
  • నిర్మాణానికి సహకారం అందిస్తానని హామీ

చంద్రగిరి, ఆంధ్రప్రభ: తిరుపతి జిల్లా చంద్రగిరి పాతపేటలోని లూకస్ లితరెన్ చర్చి నూతన భవన నిర్మాణానికి నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చి ఫాదర్లు, లూకస్ లితరెన్ చర్చి కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి సత్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పార్టీలకు, కుల మతాలకు అతీతంగా ప్రజలకు సేవలందిస్తోందని అన్నారు. ప్రతి మతానికి సమాన గౌరవం ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

చర్చి నూతన భవన నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ నిర్మాణం విజయవంతంగా పూర్తయ్యేలా అవసరమైన సహకారం అందిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, క్రైస్తవ సోదరులు, సోదరీమణులు, చర్చి కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.