మృతుడి కుటుంబానికి సర్పంచ్ ఆర్థిక సాయం
కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం
నడిగూడెం, ఆంధ్రప్రభ: సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం చెన్నకేశవపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త పచ్చిగొల్ల సర్వయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన కుటుంబాన్ని గ్రామ సర్పంచ్ గోసుల రాజేష్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చిన సర్పంచ్ గోసుల రాజేష్, సర్వయ్య కుమారుడు పచ్చిగొల్ల నరేష్‌కు రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ అనంతుల ఉపేందర్, వార్డు సభ్యుడు పప్పుల ఉపేందర్, పచ్చిగొల్ల స్వరూప, ఆర్ఎంపీ డాక్టర్ కొత్త ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
