TG | స్థానిక సంస్థల ఎన్నికలు ….నేడు రేవంత్ సమీక్ష

హైదరాబాద్ – స్థానిక సంస్థల ఎన్నికల నేపద్యం లో ఈ నేడు సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో భేటీ కానున్నారు.దీనికి మంత్రులు, కీలక అధికారులు హాజరుకానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నేడు పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో కమాండ్కంట్రోల్ సెంటర్‌లో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. దీనికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, సీఎస్ శాంతి కుమారి, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి లోకేశ్కుమార్, ఇతర శాఖల మంత్రులు, అధికారులు సైతం హాజరుకానున్నారు. డెడికేటెడ్కమిషన్నివేదికను కోర్టుకు అందించడం వంటి అంశాలపై ఈ సందర్భంగా చర్చ జరగనున్నట్టు సమాచారం. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఈసీకి అన్ని విధాలుగా సహకరించేలా సీఎం రేవంత్ఆదేశాలు ఇవ్వనున్నారు.

అదే విధంగా ఎన్నికల సంఘం(ఈసీ) సైతం పొలిటికల్ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. పంచాయతీ రాజ్ శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానుంది. ప్రభుత్వం వైపు నుంచి స్థానిక ఎన్నికల కోసం చేసిన, చేయాల్సిన ఏర్పాట్లు, డెడికేటెడ్కమిషన్నివేదిక, ఇతర అంశాలతో పాటు ముందుగా ఏ ఎన్నికలు నిర్వహించాలనే దానిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *