AP | కారు–ఆటో ఢీకొని…

AP | కారు–ఆటో ఢీకొని…
AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తిరుపతిలో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. మద్యం మత్తులో కారును నడిపిన వ్యక్తి నియంత్రణ కోల్పోవడంతో కారు, ఆటో డ్రైనేజీలో పడిపోయాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లీలా మహల్ సమీపంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ట్రాన్స్ ఉమెన్‌తో కలిసి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఈ క్రమంలో పోలీసులు కనిపించడంతో భయపడిన డ్రైవర్, మద్యం మత్తులో ఉండటంతో స్టీరింగ్‌పై నియంత్రణ కోల్పోయాడు. దీంతో పక్కనే వెళ్తున్న ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ఢీకొనడం తీవ్రంగా ఉండటంతో కారు, ఆటో రెండూ పల్టీలు కొట్టి సుమారు పది అడుగుల లోతులో ఉన్న డ్రైనేజీలో పడిపోయాయి. అయితే ఈ ప్రమాదంలో ఇరు వాహనాల డ్రైవర్లు స్వల్ప గాయాలతో బయటపడడం ఊరట కలిగించింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
