తెలంగాణ అమరవీరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మరోసారి అండగా నిలిచారు.
అమరవీరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబ సభ్యులు… కేసీఆర్‌ని ఎర్రవెల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ఉద్యమ అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబాన్ని కేసీఆర్ ఆదుకుంటున్న విషయం తెలిసిందే.
కిష్టయ్య కుమార్తె ప్రియాంక చదువుకు కేసీఆర్ ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ చేస్తున్న డాక్టర్ ప్రియాంక చదువుకు కేసీఆర్ ఈరోజు ఆర్థిక సహాయం అందించారు.
కిష్టయ్య కుమారుడు రాహుల్ వివాహం నిశ్చయమైందని తెలుసుకున్న కేసీఆర్ ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. కిష్టయ్య కుటుంబానికి తన పూర్తి మద్దతు ఎప్పటికీ కొనసాగుతుందని హామీ ఇచ్చారు.