Medical Negligence Death | ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యమేనంటూ కుటుంబ సభ్యుల ఆరోపణ

Medical Negligence Death | ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యమేనంటూ కుటుంబ సభ్యుల ఆరోపణ

అల్వాల్ లో ఘటన
ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు

Medical Negligence Death | అల్వాల్, ఆంధ్రప్రభ : ప్రయివేటు ఆసుపత్రిలో డాక్టర్ల నిర్వాకం వల్ల ఓ మహిళ మృతి చెందిన సంఘటన అల్వాల్ లో కలకలం సృష్టించింది. కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్ సర్కిల్ పాత అల్వాల్ సిటిజన్ కాలనీకి చెందిన ప్రభావతి (45) వేలికి చికిత్స నిమిత్తం స్థానిక ఎక్స్ ల్ ఆసుపత్రిలో ఈనెల 11న చేరడం జరిగింది. అయితే చికిత్స పొందుతూ సదరు మహిళ మృతి చెందారు. కేవలం ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ఆమె మృతి చెందారని పేర్కోంటూ మహిళ కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు.

Leave a Reply