భగవాన్ బుద్ధుని భోదనలు స్ఫూర్తిదాయకం
భగవాన్ బుద్ధుని భోదనలు స్ఫూర్తిదాయకం
ప్రత్యేక పూజలు చేసిన రితీష్ రాథోడ్
ఉట్నూర్,మే 2 (ఆంధ్రప్రభ ) భగవాన్ బుద్ధుని బోధనలు స్ఫూర్తిదాయకమని బిజెపి నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉప్పూర్ మండలంలోని ఎందా గ్రామంలో గల బుద్ధుని క్షేత్రంలో శనివారం జరిగినబుద్ధ పూర్ణిమ పర్వదినం కార్యక్రమంలో ఆయన భక్తులతో కలిసి ప్రత్యేక ప్రార్థన లు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ ప్రజలందరికి బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రితీష్ రాథోడ్ మాట్లాడుతూభగవాన్ బుద్ధుని కరుణ, సత్యం, అహింస, శాంతి సందేశాలు మానవాళిని సదా సామరస్యం, ధర్మమార్గం వైపు నడిపిస్తూనే ఉంటాయని పేర్కొన్నారు.ఈ పవిత్రమైన రోజున ఆయన మహోన్నత బోధనల నుండి స్ఫూర్తిపొందుతూ,మరింతకరుణామయమైన, శాంతియుతమైన, సమగ్ర సమాజ నిర్మాణానికి మనమందరం కృషి చేద్దామని రితేష్ రాథోడ్ కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, భగవాన్ బుద్ధ భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు.
