పొలాసలో ఉద్రిక్తత వాతావరణం..

  • రైతుల భూముల్లో చెట్లు నాటేందుకు అటవీశాఖ అధికారుల ప్రయత్నం
  • అడ్డుకున్న రైతులు ప్రజాప్రతినిధులు

జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని రావు జీగూడ పంచాయతీలో గల పొలాస గ్రామ శివారు ప్రాంతాల్లో రైతులు 50 సంవత్సరాల పైగా సాగు చేసుకుంటున్న పోడు భూములలో అటవీశాఖ అధికారులు ఆ భూములు అటవీ భూమిలేదని అందులో మొక్కలు నాటేందుకు జెసిపి తో సహా 30 మంది ఫారెస్ట్ అధికారులు ఉద్యోగులు వచ్చి జెసిబి తో చెట్లు నాటేందుకు గుంతలు తవ్వే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన రావుజిగూడ సర్పంచ్ జాదవ్ బహు రావు, మాజీ ఉపసర్పంచ్ షేక్ ఖలీల్ 100 మంది వరకు రైతులు వెళ్లి అటవీశాఖ అధికారులు తమ భూముల్లో చెట్లు నాటేందుకు గుంతలు తవ్వడానికి వచ్చిన జెసిబిని అడ్డుకున్నారు.

అటవీ శాఖ అధికారులకు రైతుల మధ్య వాగ్వి వాద మాటలు జరిగాయి. అక్కడ అటవీశాఖ అధికారుల రైతుల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది ఈ విషయం తెలియగానే జైనూర్ సీఐ రమేష్ పోలీసులతో వెళ్లి రైతులకు అటవీశాఖ అధికారులతో సీఐ వివరాలు తెలుసుకొని సముదాయించారు. సర్పంచ్ బహు రావు తో పాటు రైతులు మాట్లాడుతూ దాదాపు21 మంది రైతులు 50 ఎకరాల్లో గత 1965 నుంచి సాగు చేసుకుంటున్నారని రెవెన్యూ రికార్డులో ఉందని పోలీసులకు అటవీ శాఖ అధికారులకు వివరించారు.

విషయాలు తెలుసుకున్న సీఐ ఫారెస్ట్ అధికారులతో మాట్లాడుతూ రెవెన్యూ,అటవీ శాఖ జాయింట్ సర్వే చేసిన తర్వాత రైతులు చూపించేఆధారాల ప్రకారంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు దీంతో అటవీశాఖ అధికారులు మాత్రం జిల్లా అటు విశాఖ అధికారి ఆదేశాల మేరకే వచ్చామని రైతులు గొడవలు చేస్తే ఎక్కువ మంది పోలీసులతో వచ్చి చర్యలు తీసుకొని ఈ భూముల్లో మొక్కలు నాటుతామని అటవీ అధికారి చెప్పడంతో రైతులు అగ్రహం వ్యక్తం చేశారు.

సీఐ సముదా యించడంతో అటవీశాఖ అధికారులు రైతులు వెళ్లిపోయారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం చల్లబడింది. పది రోజుల్లో తమ భూమి లేనని ప్రభుత్వం నుండి ఆర్డర్లు తెచ్చుకోవాలని ఫారెస్ట్ అధికారులు గడువు ఇచ్చారని, తెలపడంతో తాము ఆధారాలు చూపిస్తామని రైతులు ఒప్పుకున్నారు. దీంతో అటవీ శాఖ అధికారులు తిరిగి వెళ్ళిపోయారు. పది రోజుల్లో ఆధారాలు తీసుకురాకుంటే మళ్లీ వచ్చి ఈ భూముల్లో అటవీశాఖ ద్వారా మొక్కలు నాడుతామని అటవీ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులతో పోలీసులతో అధికారులతో పేర్కొన్నారు. తమకు గడువు ప్రకారంగా ఆధారాలు తీయిస్తామని రైతులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జాదవ్ బాహు రావు, మాజీ ఉపసర్పంచ్ ఖలీల్, పులస గ్రామ పటేల్ కురుషాంగ ప్రసాద్, నాయకులు రైతులు పాల్గొన్నారు.