వరి ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం

వరి ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం
- డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం
దండేపల్లి, ఆంధ్రప్రభ : రైతులు పండించిన పంటలు కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టి కుప్పలు పోసిన ఇప్పటి వరకు ఐకెపి కొనుగోలు కేంద్రాల వద్ద తూకం పెట్టాలేదని శనివారం బిజెపి కిసాన్ మోర్చా జిల్లా నాయకులు గోపతి రాజయ్య ఆధ్వర్యంలో దండేపల్లి డిప్యూటీ తహశీల్దార్ మాధవి కి వినతిపత్రాన్ని అందజేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతులు పొలాలు కోసి వరి ధాన్యాన్ని అరబెట్టుకొని ఇప్పటికీ20 రోజులు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తాలేదంటే రైతుల బాధ ఎవరికి చెప్పుకోవడమని అన్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి వరిదాన్యం కొనుగోలు తుకాలను ప్రాంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎంబడి సురేందర్, వెల్గనూర్ సర్పంచ్ మొరుపుటలా మానస సంజీవ్, కన్నెపల్లి మాజీ సర్పంచ్ రజిత సురేందర్,మాజీ ఉపసర్పంచ్ దుమ్మని సత్తయ్య, నాయకులు, టేకుమట్ల గురువయ్య, గుర్రం రాజన్న, మాల్యాల, రమేష్, చంద్రమౌళి, తదితరులు పాల్గొన్నారు.
