శివనగర్ స్టేషన్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి..

శివనగర్ స్టేషన్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి..

ప్రజలతో కలిసి రోడ్డు పరిశీలించిన కార్పొరేటర్ డీకే

కరీమాబాద్, ఆంధ్రప్రభ : గ్రేటర్ వరంగల్ అండర్ బ్రిడ్జి శివనగర్ నుండి రైల్వే స్టేషన్ వరకుసిసి రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని 34 డివిజన్ కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ శివనగర్ రైల్వే బుకింగ్ లైన్ రోడ్డు అండర్ బ్రిడ్జి శివనగర్ నుండి రైల్వే స్టేషన్ వరకు మైన్ సిసి రోడ్డు గతంలో అండర్ బ్రిడ్జి నుండి ఎంబాడీ రవీంద్ర అపార్ట్మెంట్ వరకు రోడ్డు వేసి పనులను నిలిపివేశారని ఆయన అన్నారు మిగతా రోడ్డు గత ఆరు సంవత్సరాల నుండి నిర్మాణం చేపట్టలేదని పలు మార్లు మేయర్, కమిషనర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని దానికి వారు చెప్పే సమాధానంఅండర్ డక్ట్ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ మిగతా రోడ్డు పనులు పూర్తి చేస్తారని అధికారులు తెలిపారని కార్పొరేటర్ దిడ్డి కుమార్ స్వామి అన్నారు. కానీ నేటి వరకు రోడ్డు వేయలేదు. రోడ్డు మొత్తం గతుకుల మయమై, బాటసారులకు వాహనదారులకు రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని ఆయన అన్నారు. తక్షణమే మిగతా రోడ్డు నిర్మాణం పనులు చేపట్టాలని ఆయన మంత్రి కొండ సురేఖకు విజ్ఞప్తి చేశానని తెలిపారు.

తాగునీటి సమస్య..

డివిజన్ లోతాగునీటి సమస్య ఉందని సరైన పంపిణీ లేకపోవడంతో ప్రజలు త్రాగునీరుకు ఇబ్బంది పడుతున్నారని పలుమార్లు కౌన్సిల్ మీటింగులో , మేయర్ అధికారుల దృష్టికి తీసుకొని రావడం జరిగిందని ఆయన అన్నారు. నేటికీ కొన్ని వీధుల్లో సుమారు 5 సంవత్సరాల నుండి భగీరథ త్రాగునీరు రావడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు 34 డివిజన్ శివనగర్ లో భగీరథ త్రాగునీరు సక్రమంగా పంపిణీ అయ్యే విధంగా, అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. కార్యక్రమంలో గోగుల ఇందిర, శామంతుల సుకన్య పోలేపాక రాజు, బిల్లా రాజు, జై పురుషోత్తం, నూతన్, అవినాష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.