సర్ ప్రక్రియ సక్రమంగా నిర్వహించాలి..

తొర్రూరు, ఆంధ్రప్రభ : సర్ (SIR) ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించి సక్రమంగా నిర్వహించాలని తొర్రూరు మున్సిపల్ 4వ వార్డు కౌన్సిలర్ పేర్ల జంపన్న అన్నారు.

శుక్రవారం నాలుగో వార్డులో బీఎల్‌ఓలు స్థానికులకు దరఖాస్తు ఫారాలు పంపిణీ చేసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీలోని 268, 269 పోలింగ్ బూత్‌ల పరిధిలో జరుగుతున్న సర్ సర్వే దరఖాస్తులు ప్రతి అర్హుడికి చేరేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రతి ఓటరు తప్పనిసరిగా దరఖాస్తు ఫారాలను పూర్తి చేసి బీఎల్‌ఓలకు అందజేయాలని ఆయన తెలిపారు. బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ఫారాలు అందజేసి ఈ ప్రక్రియను పూర్తిస్థాయిలో నిర్వహించాలని కోరారు. స్థానికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఎల్‌ఓలు రేణుక, శ్రావణి, అరుణతో పాటు స్థానికులు పాల్గొన్నారు.