మృతునికి నివాళులర్పించిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్

మృతునికి నివాళులర్పించిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్
పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలో అకాల మరణం చెందిన మృతుని పార్థివదేహానికి మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి నివాళులర్పించారు. ఆదివారం రోజు పరకాల పట్టణంలోని 18 వ వార్డులో పసుల సమ్మయ్య అకాల మరణం చెందారు విషయం తెలుసుకున్న మాజీ వైస్ చైర్మన్ రేగురి విజయపాల్ రెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 19వ వార్డు బిఆర్ఎస్ కంటెస్టెడ్ కౌన్సిలర్ అభ్యర్థి ఏకు బొబ్బిలి, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షుడు చర్లపల్లి శ్రీనివాసు, 18వ వార్డ్ అధ్యక్షులు ఏకు రఘుపతి,19వ వార్డ్ అధ్యక్షులు బొట్ల నరేష్, ఏకు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
