CM Vijay | 6 కిలోమీటర్లు పరుగెత్తిన సీఎం విజయ్

CM Vijay | 6 కిలోమీటర్లు పరుగెత్తిన సీఎం విజయ్

CM Vijay | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం గురువారం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా పాల్గొని 6 కిలోమీటర్ల మారథాన్‌కు శ్రీకారం చుట్టారు.

“మాదకద్రవ్యాలు వీడుదాం… పరుగు మొదలుపెడదాం” అనే నినాదంతో మారథాన్‌ను ప్రారంభించిన విజయ్, పెద్ద సంఖ్యలో హాజరైన యువత, క్రీడాకారులు, ప్రజలతో కలిసి పరుగెత్తారు. కార్యక్రమం ద్వారా మాదకద్రవ్యాల వ్యసనానికి దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

52 ఏళ్ల వయసులోనూ విజయ్ ఉత్సాహంగా మొత్తం 6 కిలోమీటర్ల పరుగు పూర్తి చేయడం విశేషంగా నిలిచింది. ఆయన ఫిట్‌నెస్‌ను చూసి పాల్గొన్నవారు అభినందనలు తెలిపారు. అధికారులు కూడా విజయ్ క్రమం తప్పకుండా యోగా, నడక, వ్యాయామం చేయడం వల్లే ఈ స్థాయి ఫిట్‌నెస్ సాధ్యమైందని పేర్కొన్నారు.

ఈ మారథాన్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యమంత్రి విజయ్ ఫిట్‌నెస్, యువతకు ఇచ్చిన సందేశంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.