అభినయ కళా సమితి ఉపాధ్యక్షుడు జానీ కన్నుమూత

అభినయ కళా సమితి ఉపాధ్యక్షుడు జానీ కన్నుమూత
మోత్కూర్, ఆంధ్రప్రభ: సుదీర్ఘకాలం అభినయ కళా సమితి కళాకారునిగా ఉపాధ్యక్షుడిగా, కార్యదర్శిగా మోత్కూరు ప్రాంత సాంస్కృతిక రంగానికి సేవలు అందించిన,మిత్ర యూత్, మన మోత్కూర్ వాట్సప్ గ్రూప్ సభ్యుడు మహమ్మద్ జానీ( అస్రఫ్ అలీ ) కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. 1995-2002 మధ్యకాలంలో అభినయ కళా సమితి ప్రదర్శించిన నవతరం, సంధిగ్ధసంధ్య వంటి నాటకాల్లో కీలకమైన పాత్రలు పోషించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రముఖుల చేత అవార్డులు కూడా అందుకున్నారు. జానీ మరణం మోత్కూరు ప్రాంత కళారంగానికి తీరని లోటని అభినయ కళా సమితి అధ్యక్షుడు ప్రముఖ సినీ గేయ రచయిత అభినయ శ్రీనివాస్ తెలిపారు.సంస్థ కళాకారులు సతీష్, దుద్దుల నరసయ్య, గుంటి దేవా,ఉపేంద్ర చారి అక్బర్ అలీ,నక్క శంకర్,బుంగపట్ల యాకయ్య జంగ శ్రీను నాగరాజు, నరసింహ చారి,దొంతోజు శ్రీనివాసచారి జానితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని నివాళులు అర్పించారు.
