మునుగోడు, (ఆంధ్రప్రభ): సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్సై ఇరుగు రవి సూచించారు. సోమవారం మండలంలోని కొరటికల్ గ్రామంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు, దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సై ఇరుగు రవి మాట్లాడుతూ… కొత్త నంబర్ నుంచి ఫోన్ కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని సూచించారు. ఇళ్లలో విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఎక్కువగా ఉంచవద్దని హెచ్చరించారు.
వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు వాహనానికి సంబంధించిన పత్రాలు సరిగ్గా ఉంచుకోవాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని సూచించారు.

