పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం….

పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం….
బిక్కనూరు, ఆంధ్ర ప్రభ : పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి అన్నారు సోమవారం మండలంలోని రామేశ్వర పల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ చేపూరి రాణి రాజు ఉపసర్పంచ్ వినోద్ గౌడ్ ల ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందని గుర్తు చేశారు. లబ్ధిదారులు సకాలంలో ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మద్ది సూర్యకాంత్ రెడ్డి, ఎ ఏం సి డైరెక్టర్ నాగర్తి రమేష్ రెడ్డి,వార్డు సభ్యులు పనాస రాజు మన్నే కళ్యాణి రవి ,సెక్రటరీ శ్యామ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులుచేపూరి రాంలు, లింగం, అనిల్,ప్రవీణ్,ప్రేమ్, యువకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
