ఉపాధి పనులు కూలీలు సద్వినియోగం చేసుకోవాలి..

ఉపాధి పనులు కూలీలు సద్వినియోగం చేసుకోవాలి..

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ :– ఉపాధి హామీ పనులను జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో చింత.రాజ శ్రీనివాస్ పేర్కొన్నారు.మంగళవారం కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని పల్లె చెరువులో జరుగుతున్న పూడికతీత పనులను ఎంపిడివో రాజ శ్రీనివాస్ క్షేత్ర స్థాయిలో సందర్శించి,పరిశీలించి,మస్టర్ రోల్ లో కూలీల హాజరు తీసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పని ప్రదేశంలో కల్పిస్తున్న మౌళిక వసతులపై ఫీల్డ్ అసిస్టెంట్ ను ఆరా తీసి పలు సూచనలు చేశారు. ఉపాధిహామీ పనులకు కూలీలు ఎక్కువ సంఖ్యలో వచ్చేలా చూడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మీ రమ,మేట్లు,కూలీలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply