బిఆర్ఎస్ జెండా ఆవిష్కరిస్తున్న పార్టీ అధ్యక్షులు, నాయకులు

బిఆర్ఎస్ జెండా ఆవిష్కరిస్తున్న పార్టీ అధ్యక్షులు, నాయకులు
సిర్పూర్ (యు )లో బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు
సిర్పూర్ (యు) (ఆంధ్రప్రభ) అసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి ఆదేశాల మేరకు కొమరం భీ0 అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు )మండల కేంద్రంలో సోమవారం బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు తొడసం ధర్మారావు బి ఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. జై తెలంగాణ జై కెసిఆర్ జై కోవా లక్ష్మీ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షులు ధర్మారావు, సిర్పూర్ (యు) మాజీ ఎంపీపీ తొడసం భాగ్యలక్ష్మి ,సిర్పూర్ (యు) పంచాయితీ సర్పంచ్ ఆత్రం ఓం ప్రకాష్ మాట్లాడుతూ బి ఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్ని వర్గాల నిరుపేదలకు న్యాయం చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో కేసీఆర్ అని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, నాందేవ్, బొ జ్జిరావు, అర్కనాగోరావు, ఆంధ్రయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
