శివుని మహిమతో రాతిపై వెలసిన నంది

శివుని మహిమతో రాతిపై వెలసిన నంది

  • భక్తిశ్రద్ధలతో నందికి నామకరణం

జుక్కల్, ఆంధ్రప్రభ : అక్షయ తృతీయ రోజును పురస్కరించుకొని ఆదివారం నాడు జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామ శివారులో ప్రసిద్ధిగాంచిన బసవన్న మందిరంలో నందినామకరణం కార్యక్రమం భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా కొనసాగింది.బస్వాపూర్ గ్రామం ఏర్పడక ముందే దశాబ్దాల క్రితం అక్కడి శివారులో గల పెద్దపెద్ద రాతి బండల మధ్యన ఓరాతిపై బసవన్న(నంది) రూపం తనకుతానుగా ఏర్పడింది.ఇది శివుని మహిమ వల్ల ఏర్పడిందని భక్తులు,ప్రజలు భావించడమే కాకుండా అక్కడ బసవన్నగుడి ఏర్పాటు చేశారు.దాని తర్వాత బసవన్న గుడి పేరు మీదే బస్వపూర్ గ్రామం ఏర్పాటు కావడం జరిగిందని, చరిత్రకారులు చెప్పుతుంటారు.

భక్తుల కోరిన కోరికలు తీర్చే బసవన్నగా ఈ గుడిపేరు పొందడంతో జుక్కల్ మండలమే కాకుండా, ఇతర మండల,ప్రదేశాల నుండి కూడా భక్తులు బసవన్న దర్శనానికి రావటం జరుగుతుంది.అక్షయ తృతీయ నాడే బసవన్న దేవుడు వెలిశాడని భావిస్తూ ఆగ్రామస్తులు అదే రోజు బసవన్న జయంతి ఉత్సవాలు, నందినామకరణ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. బస్వపూర్ గ్రామస్తులు సమిష్టిగా కృషి చేస్తూ జయంతికి ఏడు రోజుల ముందు నుండే అఖండహరినామ సప్త కార్యక్రమాన్ని నిర్వహించారు.

అక్షయతృతీయ ను పురస్కరించుకొని బసవన్న జయంతి సందర్భంగా గుడిని అందంగా అనుచరించడమే కాకుండా,అందంగా అలంకరించి ఉయ్యాలలో బసవన్న(నంది )విగ్రహాన్ని ఉంచి మహిళలు భక్తిపాటలుతో పాటు ఉయ్యాల పాటలు పాడుతూ నందికి నామకరణం చేశారు. ఈ సందర్భంగా అగ్నిగుండం ఏర్పాటు చేసి భక్తులు నిప్పురవ్వలపై నడిచారు. అత్యధికంగా పాల్గొన్న మహిళ భక్తులు బసవన్నకు ప్రత్యేక పూజలు చేశారు.ఆలయ కమిటీ నిర్వాహకులు ఆయా ప్రాంతాలు ఉండి వచ్చిన వందలభక్తులకు అన్నదాన కార్యక్రమంతో పాటు సకల సౌకర్యాలను కల్పించారు. నామకరణం కన్నా ముందు బస్వపూర్ గ్రామం నుండి గుడివరకు భజన కీర్తనలతో పల్లకి సేవ ఊరేగింపు భాజా భజంత్రీలతో కొనసాగింది.

Leave a Reply