బాధితులకు న్యాయం చేయాలి..

బాధితులకు న్యాయం చేయాలి..

  • నేరస్తులకు తప్పనిసరిగా శిక్ష పడేలా చూడాలి..
  • పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెంచాలి..
  • రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా

గోదావరిఖని, ఆంధ్రప్రభ : బాధితులకు న్యాయం చేయడంతోపాటు నేరస్తులకు శిక్ష పడడంలో కోర్టు డ్యూటీ పోలీస్ అధికారుల పాత్ర కీలకమని రామగుండం పోలీస్ కవి షనర్ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. శనివారం సీపీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో కోర్టు డ్యూటీ, కోర్టు లైజనింగ్ పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వ వాంచారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా మహిళలపై జరిగే నేరాలు, ఆస్తి సంబంధిత నేరాలు, శారీరక దాడులు తదితర కేసుల్లో నిందితులకు తప్పనిసరిగా శిక్ష పడే విధంగా పకడ్బందీగా దర్యాప్తు చేపట్టి, బలమైన సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టి, న్యాయస్థానంలో సమర్థవంతంగా కేసులను వాదించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

బాధితులకు సత్వర న్యాయం అందేలా దర్యాప్తు అధికారులు, కోర్టు డ్యూటీ సిబ్బంది, కోర్టు లైజనింగ్ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. నేరస్తులకు శిక్ష పడడం ద్వారా బాధితుల్లో న్యాయవ్యవస్థపై విశ్వాసం పెరుగుతుందని, సమాజంలో నేరాల నియంత్రణకు కూడా ఇది దోహదపడుతుందన్నారు. ఎన్బీడబ్ల్యూలు, సమన్లను తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. కేసులు విచారణలో ఉన్నప్పుడు కేవలం కోర్టుకు హాజరుకావడం మాత్రమే కాకుండా, నిందితులకు శిక్షలు పడేలా చూడటం కూడా పోలీసుల ప్రధాన బాధ్యత అని తెలిపారు.

సరైన సమయంలో సమన్లు జారీ చేయడం, అవసరమైతే నిందితుల ఆస్తులను జప్తు చేయడం వంటి ప్రక్రియలను ఆలస్యం చె యకుండా వెంటనే చేపట్టాలన్నారు.రామగుండం కమిషనరేట్ పనితీరు కోర్టు డ్యూటీ, లైజనింగ్ అధికారుల పనితీరుపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ప్రజలు, ముఖ్యంగా బాధితులు పోలీసులను ఎంతో నమ్మకంతో ఆశ్రయిస్తారని, నేరస్తులకు శిక్ష పడేలా చేసి వారికి భరోసా కల్పించడం పోలీసులు బాధ్యతగా పేర్కొన్నారు. సాక్షుల వాంగ్మూలాలు, సాంకె తిక ఆధారాలు, వైద్య ఆధారాలను సమగ్రంగా సేకరించి కోర్టుకు సమర్పిస్తేనే నేరస్తులకు శిక్ష విధించడం సాధ్యమవుతుందని తెలిపారు.

తద్వారా నేరస్తుల్లో నేరాలకు పాల్పడాలనే ఆలోచనకే భయం కలిగే పరిస్థితి రావాలన్నారు. రానున్న రోజుల్లో నేరాల నిరూపణ శాతాన్ని మరింత పెంచి, నిందితులకు శిక్షలు పడేలా చేయడం ద్వారా బాధితుల్లో పోలీస్ వ్యవస్థ పై మరింత విశ్వాసం పెంపొందించాలన్నారు. నేరం జరిగిన వెంటనే, ఆ సంఘటన ప్రభావం తగ్గకముందే శిక్ష విధించబడితే అది నేరస్తులపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేరొ ్కన్నారు. కాంటెస్టెడ్ కేసుల్లో నిందితులు బాధితులను బెదిరించడం లేదా ఇతర ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉంటుందని, అలాంటి సందర్భాల్లో కోర్టు డ్యూటీ అధికారులు బాధితులతో నిరంతరం సంప్రదింపులు జరపాలని సూచించారు.

Leave a Reply