ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలి..

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలి..
చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి
చౌటుప్పల్, ఆంధ్రప్రభ: ప్రమాదాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చౌటుప్పల్ డీఎస్పీ పటోళ్ల మధుసూదన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలనలో భాగంగా, ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎరైవ్, ఎలైవ్ క్యాంప్పైన్ -2026 ప్రోగ్రామ్ లో భాగంగా చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 26 గ్రామ పంచాయతీలలో, చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 20 వార్డులలో 8 మందితో కూడిన రోడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేశారు. ప్రతి కమిటీలో చైర్మన్, ముగ్గురు మహిళలు, కొంతమంది యూత్ సభ్యులు, గవర్నమెంట్ ఎంప్లాయ్, రిటైర్డ్ ఎంప్లాయ్ వంటి వారు సభ్యులుగా ఉన్నారు. మొదటి రోజు రోడ్ సేఫ్టీ కమిటీలు వేసి రోడ్ సేఫ్టీ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని, ట్రాఫిక్ రూల్స్ తప్పక పాటించాలన్నారు.మైనర్లు వాహనం నడపవద్దని, అతివేగంగా వాహనాలను నడపవద్దని తదితర విషయాలపై వాహనదారులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాలలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, ఆరెగూడెం గ్రామ సర్పంచ్ ఎన్నెపల్లి ధనలక్ష్మి వెంకట్ రెడ్డి, ఇన్స్పెక్టర్ జి మన్మధ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ విజయ్ మోహన్, ఎస్సైలు నర్సిరెడ్డి, కృష్ణమాల్, అజయ్ భార్గవ్, ఆంజనేయులు తో పాటు ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
