Famous actress | అల్లరి సుభాషిణి జీవిత ప్రయాణం..

Famous actress | అల్లరి సుభాషిణి జీవిత ప్రయాణం..

Famous actress | అల్లరి సుభాషిణి స్టూడియో సందడి
సినీ ప్రయాణం – నాటక రంగం నుంచి విజయ పథం
జ్ఞాపకాలు, ఆనందం, అనుభవాలు
భావోద్వేగ క్షణాలు – వ్యక్తిగత జీవితం
కృతజ్ఞతలు, గుర్తుంచుకునే వ్యక్తులు
నవ్వుల వెనుక నిజమైన కథ

Famous actress | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ ప్రేక్షకులను తన నవ్వులతో కడుపుబ్బ నవ్వించిన ప్రముఖ నటి అల్లరి సుభాషిణి తాజాగా ఆంధ్రప్రభ స్టూడియోలో సందడి చేశారు. చాలా కాలంగా ఆమెను ఇంటర్వ్యూకు ఆహ్వానించేందుకు ప్రయత్నాలు జరుగుతుండగా, చివరకు ఆమె సమయం కేటాయించడం, స్టూడియోకి రావడం ఇంటర్వ్యూ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి.

ఇంటర్వ్యూ ప్రారంభమైన కొద్దిసేపటికే ఆమె మాటల్లో సహజత్వం, నవ్వుల్లో ఆప్యాయత కనిపించాయి. తన సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ సుభాషిణి చెప్పిన ప్రతి సంఘటన ప్రేక్షకులకు ఆసక్తికరంగా కలిగించేలా సాగింది. ‘అల్లరి’ సినిమాలో అవకాశం రావడానికి తన నాటక రంగ అనుభవమే కారణమని ఆమె వెల్లడించారు.

Famous actress

చిన్నతనం నుంచే రంగస్థలంపై చింతామణి, సత్యభామ వంటి పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నానని ఆమె చెప్పారు. ఆ రోజుల్లో నాటక ప్రదర్శనలు అంటే ఒక పండుగలా ఉండేదని, తనతో పాటు పని చేసే వారికి అన్నం పెట్టడం తనకు అలవాటని, దాదాపు పది మంది అసిస్టెంట్లు తనతో ఉండేవారని గుర్తు చేసుకున్నారు. ఆ జ్ఞాపకాలు చెప్పేటప్పుడు ఆమె కళ్లలో కనిపించిన ఆనందం ప్రత్యేకంగా అనిపించింది.

సినీ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత కూడా వెనక్కి తిరిగి చూడాల్సిన పరిస్థితి రాలేదని, ఇప్పటి వరకు దాదాపు 200 సినిమాల్లో నటించానని ఆమె గర్వంగా చెప్పారు. ఈ ప్రయాణంలో తనకు అవకాశాలు కల్పించిన వారిని ఆమె మరచిపోలేదన్నారు. దివంగత నటులు చలపథి రావు తనకు మొదటి అవకాశాన్ని ఇచ్చారని, నిర్మాత డీ. రామానాయుడు, దర్శకుడు ఈ వీవీ సత్యనారాయణ తనను ఎంతో ఆదరించారని తెలిపారు. ఈవీవీ సత్యనారాయణ లేని లోటు ఇప్పటికీ పరిశ్రమకు తీరనిదని భావోద్వేగంగా చెప్పారు.

Famous actress

ఇంటర్వ్యూలో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు చెప్పినప్పుడు మాత్రం ఆమె స్వరం కాస్త కంపించింది. “మా అక్క బ్రతికి ఉంటే నేను సినీ ఇండస్ట్రీకి వచ్చేదాన్నే కాను” అని భావోద్వేగంతో చెప్పారు.

ప్రముఖ హాస్యనటుడు ఎం. ఎస్. నారాయణ తమ భీమవరం వాసి మాత్రమే కాకుండా, తనకు ట్యూషన్ టీచర్ కూడా అని చెప్పారు.. అంతేకాదు, ప్రముఖ యాంకర్ సుమ కనకాల తన ప్రాణాలు కాపాడిన దేవత లాంటిదని చెప్పినప్పుడు ఆమె కళ్లలో కనిపించిన కృతజ్ఞత ప్రేక్షకుల మనసులను తాకింది.

ఇలా నవ్వుల వెనుక ఉన్న నిజ జీవిత భావోద్వేగాలు, కష్టాలు, అనుభవాలు—అన్నీ కలిపి ఈ ఇంటర్వ్యూను మరింత ప్రత్యేకంగా నిలిపాయి.. ఇంకా ఎన్నో ఆసక్తికర విశేషాలు ఈ ఇంటర్వ్యూలో ఉన్నాయి… మరి ఆలస్యం ఎందుకు? చూసేయండి!