షార్ట్‌సర్క్యూట్‌తో పూరి గుడిసె దగ్ధం.. రూ.60 వేల నగదు బూడిద

చిట్యాల, ఆంధ్రప్రభ: మండలంలోని అందుకు తండలో శుక్రవారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ పూరి గుడిసె పూర్తిగా దగ్ధమైంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. దాసరి శ్యామల–లక్ష్మీపతి దంపతులకు చెందిన పూరి గుడిసెలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలను అదుపులోకి తెచ్చేలోపే గుడిసెతో పాటు అందులో నిల్వ ఉంచిన రూ.60 వేల నగదు, నిత్యావసర వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనలో తీవ్రంగా నష్టపోయిన బాధిత దంపతులు తమకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరారు.