బాపూజీ సేవలు చిరస్మరణీయం

బాపూజీ సేవలు చిరస్మరణీయం

ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : స్వాతంత్ర్య‌ సమరయోధులు కొండా లక్ష్మణ్ బాపూజీ (Konda Laxman Bapuji) సేవలు చిరస్మరణీయమని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) అన్నారు. ఈ రోజు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా నల్లగొండ పట్టణంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

నిబద్ధత కలిగిన నాయకుడిగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా తెలంగాణ కోసం పోరాడిన గొప్ప వ్యక్తిగా కొండా లక్ష్మణ్ బాపూజీ ((Konda Laxman Bapuji) చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply