పశు వ్యాధుల పై పాడి రైతులు అవగాహన కలిగి ఉండాలి

పశు వ్యాధుల పై పాడి రైతులు అవగాహన కలిగి ఉండాలి
ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి మండల కేంద్రం లోని పశు వైద్యశాల లో మంగళవారం ఉచిత గాలి కుంటు నివారణ టీకాల కార్యక్రమం ప్రారంభించారు. జాతీయ పశు వ్యాధుల నియంత్రణ కార్యక్రమం లో భాగంగా కార్యక్రమం నిర్వహించినట్లు మండల పశు వైద్యాధికారి ప్రమోద్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కందగట్ల రాంచందర్ ప్రారంభించారు.
గ్రామం లో ఉన్న అన్ని పశువులకు టీకాలు వేయించి గాలి కుంటు వ్యాధి నుండి కాపాడు కోవాలని పాడి రైతులను సర్పంచ్ కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ గంగాధర్ పాడి రైతులు రవికాంత్, సుమన్, సాయికృష్ణ, సాయి కుమార్, పశు వైద్య సిబ్బంది సుశాంత్, మహేందర్, పోశెట్టి, ఖాసిఫ్ పాల్గొన్నారు.
