ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన కొక్కిరాల సురేఖ
పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు సూచన
దండేపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని తాళ్లపేట, రాజుగూడ గ్రామపంచాయతీల పరిధిలోని తాట్రా పోచం గూడెంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను మంగళవారం మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ–ప్రేమ్ సాగర్ రావు పరిశీలించారు.
ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల పురోగతిని బీఎల్‌ఓలను అడిగి తెలుసుకున్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి లోపాలకు తావులేకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా పారదర్శకంగా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఆమె, ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రక్రియను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
