పల్స్ పోలియోపై సమీక్ష సమావేశం..
మెండోరా, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని మెండోరా మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం పల్స్ పోలియో కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి వైద్యాధికారి ఫిర్దోస్ ఫాతిమా అధ్యక్షత వహించారు.రాబోయే పల్స్ పోలియో రౌండ్ను విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆమె సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.
0-5 ఏళ్లలోపు ఒక్క చిన్నారి కూడా మిగలకుండా పోలియో చుక్కలు వేయించాలని, ఇంటింటి సర్వే పక్కాగా చేపట్టాలని సూచించారు.ప్రత్యేక బృందాలు,మొబైల్ బృందాలు, ట్రాన్సిట్ బృందాల ఏర్పాటు, వ్యాక్సిన్ నిల్వ, కోల్డ్ చైన్ నిర్వహణపై ఆమె వివరించారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏఎన్ఎంలు , అంగన్వాడీ కార్యకర్తలు ఆశా వర్కర్లు,సమన్వయంతో పనిచేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు,ఆరోగ్య సిబ్బంది. ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
