బెల్లంపల్లి జీఎం విజయ్ భాస్కర్ రెడ్డికి సన్మానం

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : ఈ నెల 31న పదవీ విరమణ పొందనున్న బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ్ భాస్కర్ రెడ్డికి శుక్రవారం బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రి సిబ్బందితో సమావేశమై సింగరేణి సంస్థలో తన సుదీర్ఘ సేవాకాల అనుభవాలను పంచుకున్నారు.

అనంతరం టీబీజీకేఎస్ నాయకులు జీఎంను శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ ఆయన సింగరేణి సంస్థకు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ సిరిశెట్టి సత్యనారాయణ, ఏరియా ఆసుపత్రి అసిస్టెంట్ పిట్ సెక్రటరీ బోగి శ్రీనివాస్, అసిస్టెంట్ కార్యదర్శి రసరంజని, పిట్ కమిటీ సభ్యులు చాంద్ పాషా, ఎండీ. రవూఫ్, శ్రవణ్ రెడ్డి, సింగతి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply