విద్యకు 8% కేటాయింపు సరిపోదు

విద్యకు 8% కేటాయింపు సరిపోదు
- టీఎస్ యుటీఎఫ్ ఆగ్రహం
కరీమాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో విద్యకు 8 శాతం మాత్రమే కేటాయించడం సరికాదని టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి నామోజు శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఉదయం 34వ డివిజన్ శివనగర్లో ఆయన మాట్లాడుతూ విద్యలో మౌలిక వసతులు అభివృద్ధి కోసం విద్యా కమిషన్ కమిషన్ సూచించిన 18% నిధులు బడ్జెట్లో కేటాయించకపోవడం శోచనీయం.
అదేవిధంగా పిఆర్సి గడువు దాటి మూడు సంవత్సరాలు గావస్తున్న దానికి సంబంధించి బడ్జెట్ లో పేర్కొన పోవడం సరికాదన్నరు. పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు ఉపాధ్యాయులు మానసికంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు కావున ప్రభుత్వం ఇప్పటికైనా పెండింగ్ బకాయిలు, పిఆర్సి, డిఎ లు వెంటనే చెల్లించాలని టీఎస్ యుటిఎఫ్ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో పోరాట కార్యక్రమాన్ని తీసుకుంటామని శ్రీనివాస్ తెలిపారు.
